Home Actor అల్లు శిరీష్ ఏబీసీడీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్..?

అల్లు శిరీష్ ఏబీసీడీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్..?

96
0

మెగా హీరో అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏబీసీడీ. ఈ చిత్రాన్ని సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో యశ్ రంగినేని – మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ సినిమా నిన్న (మే 17న‌) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు శిరీష్ స‌ర‌స‌న‌ రుక్షార్ థిల్లోన్ నటించింది. ఈ మూవీ స్లోగా ఉంది. బాగుంది. ఫ‌ర‌వాలేదు..ఇలా  మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే… తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 2.25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

వేసవి సెలవులు కావడం వలన వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మలయాళంలో 2013లో వచ్చిన ఏబీసీడీకి ఇది రీమేక్. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా దుల్కర్ కెరియర్ కి ఎంతో హెల్ప్ అయింది. ఈ సినిమా తన కెరియర్ కి ఎంత‌గానో హెల్ప్ అవుతుందని అల్లు శిరీష్ న‌మ్మ‌కంగా ఉన్నాడు. మ‌రి..శిరీష్ న‌మ్మ‌కం నిజం అవుతుందో లేదో చూడాలి మరి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here