Home Actor అల్లు శిరీష్ ఏబీసీడీ లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్.

అల్లు శిరీష్ ఏబీసీడీ లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్.

108
0


అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ముంతకల్లు చేతబట్టి తాగుతుంటే నువ్వెత్తి .. ఒళ్లంతా మత్తెక్కి ఊగిపోదా ఓరబ్బీ .. జట్టుకట్టిపోదామా .. స్వర్గమే చూద్దామా .. చుక్కలన్నీ చుట్టీ దిగి కిందికి వద్దామా .. ” అంటూ ఈ పాట సాగుతోంది.

కల్లు దుకాణం నేపథ్యంలో సాగే పాట ఇది. జుడా శాండీ సంగీతం అందించ‌గా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట‌ను చిత్రీకరించారు.  మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ పాట విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లు శిరీష్ ఆశిస్తున్న విజ‌యం ఈ సినిమాతో వ‌స్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here