Home Actor అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ స్పూర్తితో ఆర్ఆర్ఆర్ – రాజ‌మౌళి

అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ స్పూర్తితో ఆర్ఆర్ఆర్ – రాజ‌మౌళి

99
0


ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ (వ‌ర్కింగ్ టైటిల్). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ లో రూపొందుతోన్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ స్టోరీ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మాట్లాడుతూ…1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామ‌రాజు పుట్టారు. వేదాలు, పురాణాలు బాగా చ‌దువుకున్నారు. కానీ..యుక్త‌వ‌య‌సులో ఉండ‌గా ఇల్లు వ‌దిలి వెళ్లిపోయారు. రెండు మూడు సంవ‌త్స‌రాలు ఎవ‌రికీ క‌న‌ప‌డ‌లేదు. ఎక్క‌డ‌కి వెళ్లారు ఏం చేసారో తెలియ‌దు. ఆత‌ర్వాత స్వాతంత్ర ఉద్య‌మం పోరాటం చేసారు.

యంగ్ ఏజ్ లో చ‌నిపోనియారు. 1901లో ఉత్త‌ర తెలంగాణ ఆదిలాబాద్ లో కొమ‌రం భీమ్ పుట్టారు. ఆయ‌న కూడా ఇల్లు వ‌దిలి వెళ్లిపోయారు. ఏం చేసారో తెలియ‌దు. ట్ర‌యిబుల్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసారు. అల్లూరి సీతారామ‌రాజు వ‌లే ఆయ‌న కూడా పోరాటం చేసారు. అల్లూరి సీతారామ రాజు వలే బ్రిటిష్ వాళ్ల చేతుల్లో చ‌నిపోయారు. ఒకే టైమ్ లో పుట్ట‌డం..ఒకే టైమ్ లో ఇల్లు వ‌దిలి వెళ్లిపోవ‌డం..ఇదంతా చ‌దువుతున్న‌ప్పుడు  ఇద్ద‌రు మ‌హావీరులు….నిజంగా వాళ్లు క‌లిసుంటే…త‌ర్వాత కాలంలో నిజాం ప్ర‌భుత్వం పై పోరాటం చేసుంటే ఎలా ఉంటుంది అనిపించింది. ఆ ఆలోచ‌న‌తోనే ఈ క‌థ పుట్టింది.

 చాలా రీసెర్చ్ చేసాం. లైఫ్ స్టైల్ ఎలా ఉండేది. మాట్లాడే విధానం ఎలా ఉండేది..? ఇలా అంతా రీసెర్చ్ చేసాం. ఈ స్టోరీకి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ బ‌లంగా ఉండాలి.  అజ‌య్ దేవ‌గ‌న్ స్ట్రాంగ్ రోల్ చేస్తున్నారు. ఆయ‌న‌కు క్యారెక్ట‌ర్ చెప్పాను వెంట‌నే డేట్స్ ఎప్పుడు కావాలి అని అడిగారు. ప్లాష్ బ్యాక్ లో క‌నిపిస్తారు. ఆలీయా భ‌ట్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. ముంబాయి ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా కలిసాం. క‌థ చెప్ప‌గానే చేస్తాన‌న్నారు. తార‌క్ స‌ర‌స‌న డేసీ ఎడ్గ‌ర్ జాన్స్ న‌టిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని క్యారెక్ట‌ర్ బ్యాక్ బోన్ లా ఉంటుంది. వ‌ర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ అనుకున్నాం. ఇదే పెట్టండి అంటున్నారు. మెయిన్ టైటిల్ ఆర్ఆర్ఆర్. అయితే…వేరే భాష‌ల్లో వేరే టైటిల్ కూడా ఉంటుంది. చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజుగా, తార‌క్ కొమ‌రం భీమ్ గా న‌టిస్తున్నారు అని చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here