Home Actor అవినీతిలేని రాజకీయ వ్యవస్థ కోసం జనసేనను గెలిపించండి – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

అవినీతిలేని రాజకీయ వ్యవస్థ కోసం జనసేనను గెలిపించండి – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

104
0


ఆదోని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రాష్ట్రంలో ఎక్క‌డా క‌న‌బ‌డ‌ని ఓ చిత్ర‌మైన‌ రాజ‌కీయ ప‌రిస్థితులు క‌న‌బ‌డ‌తాయని,  రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు కేవలం రాజ‌కీయాల‌కి మాత్ర‌మే ప్ర‌త్య‌ర్ధులని, ప్ర‌జ‌ల్ని దోచుకునే వ్య‌వ‌హారంలో మాత్రం ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. దోపిడిలో 60:40 ప‌ర్సంటేజ్ లెక్క‌న రెండు పార్టీల నాయ‌కులు పంచుకుంటున్నార‌ని,  కాంట్రాక్టుల ద‌గ్గ‌ర నుంచి క‌బ్జాల వ‌ర‌కు ఇరు వ‌ర్గాలు  ప‌ర్సంటేజ్ లెక్క‌న పంచుకుంటున్నార‌ని అన్నారు. అధికారంలో ఉన్న‌వారు 60 శాతం తీసుకుంటే, ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న‌వారికి 40 శాతం వాటా ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోందని తెలిపారు. ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా క‌ర్నూలు జిల్లా ఆదోనిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. 

స‌భ‌కు హాజ‌రైన ఆశేష జ‌న‌శ్రేణుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ..  “రెండో ముంబైగా పేరున్న ఆదోని పారిశ్రామికీక‌ర‌ణ‌లోనూ ముందుండేది. ప‌త్తి కొనుగోలుకి కేంద్రంగా ఉన్న నేప‌థ్యంలో వంద‌కు పైగా జిన్నింగ్ మిల్లులు ఉండేవి. ప‌ట్ట‌ణవాసుల‌కి ఈ మిల్లులే జీవ‌నాధారంగా ఉండేవి. కార్మిక సంఘాల్లో రాజ‌కీయ జోక్యం మొద‌లు కావ‌డంతో, ఒక్కో మిల్లు మూత‌ప‌డుతూ వ‌చ్చాయి. రాయ‌ల‌సీమ మిల్లు, కొఠారి మిల్లు, ఏటిఆర్ మిల్లులు  మూత‌ప‌డ‌టంతో సుమారు 10 వేల కార్మిక కుటుంబాలు రోడ్డునప‌డ్డాయి.  జ‌న‌సేన ప్ర‌భుత్వం రాగానే మూత‌ప‌డ్డ జిన్నింగ్ మిల్లుల‌ను తెరిపిస్తుంది. చేనేత క‌ళాకారుల జీవితాల్లో వెలుగులు నింపే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు తీసుకొస్తాం. వారి కోసం ప్ర‌త్యేక హ్యాండ్లూమ్ జోన్లు ఏర్పాటు చేస్తాం. త‌క్కువ వ‌డ్డీకి రుణాలు మంజూరు చేస్తాం. 59 ఏళ్లు నిండిన చేనేత క‌ళాకారుల‌కు రూ. 5వేలు పింఛ‌న్ అందిస్తాం. ఆదోని ప్రాంతంలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి నేత‌ల‌న్న‌ల‌కు అండ‌గా ఉంటాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here