Home Political News అసెంబ్లీ ర‌ద్దును స‌వాల్ చేస్తూ..హైకోర్టులో డీకే అరుణ పిటిష‌న్..!

అసెంబ్లీ ర‌ద్దును స‌వాల్ చేస్తూ..హైకోర్టులో డీకే అరుణ పిటిష‌న్..!

126
0

అసెంబ్లీ రద్దు పై కాంగ్రెస్ నేత డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. సభ్యుల అభిప్రాయాలు అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీని రద్దు చేశాం… మీ సభ్యత్వం రద్దు అయ్యిందంటే ఎలా? అని ఆమె నిలదీశారు. తమ హక్కులు, అసెంబ్లీ రద్దు చేసిన విధానం పై పిటిషన్‌ వేశానని అరుణ చెప్పారు. ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ద‌మ‌ని అన్నారు.

ఈరోజు షాపూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా గ‌ర్జ‌న జ‌రిగింది. ఇందులో పాల్గొన్న డీకే అరుణ‌…. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో భ‌యంతోనే ఆంధ్రులు టీఆర్ఎస్ కి ఓటేసార‌న్నారు. హైద‌రాబాద్ లో రోడ్ల కంటే గ్రామాల రోడ్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్ర‌ల భ‌వ‌నాలు లాక్కుంటామ‌ని గ‌తంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేసారు. కేసీఆర్ ఎవ‌రినైనా తిట్ట‌చ్చు కానీ..ఆయ‌న‌ను ఎవ‌రు తొట్ట‌కూడ‌ద‌ట‌. కేసీఆర్ ఇంట్లో మ‌హిళ‌ల‌ని తిడితే ఊరుకుంటాడా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు ద‌మ్ముంటే నా బండారం ఏంటో బ‌య‌ట పెట్టాల‌ని స‌వాల్ విసిరారు డీకే అరుణ‌.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here