Home Actor ఆకట్టుకుంటున్న‌ ‘హేజా ‘ టీజర్.

ఆకట్టుకుంటున్న‌ ‘హేజా ‘ టీజర్.

71
0
ఆకట్టుకుంటున్న‌ 'హేజా ' టీజర్. spiceandhra

మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేసిన మున్నా కాశీ దర్శకత్వం వహిస్తూ హీరో గా న‌టించిన‌ చిత్రం “హేజా”.  ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ఇతర పాత్ర‌లు పోషించారు. కాగా ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలవనుంది. చాల రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండగా  వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు.  నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉండగా చిత్ర బృందం నేడు టీజర్ ని రిలీజ్ చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ…  ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమా అవుట్ ఫుట్ చాల బాగా ఉంది. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు.

నిర్మాత  కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన అన్ని హార్ర‌ర్ సినిమాల క‌న్నా డిఫరెంట్ గా ఈ సినిమా ఉండబోతుంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేస్తాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here