Home Actor ఆకాష్ పూరి మూడ‌వ సినిమాకి డైరెక్ట‌ర్ ఇత‌నే..!

ఆకాష్ పూరి మూడ‌వ సినిమాకి డైరెక్ట‌ర్ ఇత‌నే..!

67
0

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. త‌న‌యుడు ఆకాష్ పూరి ప్ర‌స్తుతం రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి పూరి శిష్యుడు అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవ‌ల గోవాలో షూటింగ్ జ‌రుపుకుంది. ప్ర‌ధాన తారాగ‌ణం పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అయితే…ఆకాష్ పూరి సెకండ్ మూవీ సెట్స్ పై ఉండ‌గానే…ధ‌ర్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ఇంత‌కీ ఎవ‌రితో అంటే…నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో క‌త్తి, షేర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ మ‌ల్లిఖార్జున్ తో. ప్ర‌స్తుతం మ‌ల్లిఖార్జున్ ఆకాష్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. దీనికి కూడా క‌థ – మాట‌లు పూరి జ‌గ‌న్నాథ్ అందిస్తున్నార‌ట‌. రొమాంటిక్ మూవీని ఆగ‌ష్టులో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆత‌ర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here