Home Actor ఆకాష్ పూరి రొమాంటిక్ లో మందిరా బేడి..!

ఆకాష్ పూరి రొమాంటిక్ లో మందిరా బేడి..!

106
0


ఆకాష్ పూరి న‌టిస్తోన్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి పూరి జ‌గ‌న్నాథ్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి శిష్యుడు అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా గోవాలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఆకాష్ పూరి స‌ర‌స‌న కేతిక శ‌ర్మ న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే చిత్ర‌యూనిట్ మీడియాకి తెలియ‌చేసారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే….ఈ మూవీలో ప్ర‌ముఖ టెలివిజ‌న్ హోస్ట్ మరియు న‌టి మందిరా బేడి కీల‌క పాత్ర పోషిస్తుంది.

గోవాలో జ‌రుగుతోన్న షూటింగ్ లో మందిరా బేడి జాయిన్ అయ్యారు. పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ మ‌రియు పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ సినిమా అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోంది. ఆకాష్ పూరి న‌టించిన మెహ‌బూబా సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో రొమాంటిక్ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి.. ఆకాష్ కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here