Home Actor ఆకాష్ పూరి.. రొమాంటిక్ హీరోయిన్..!

ఆకాష్ పూరి.. రొమాంటిక్ హీరోయిన్..!

105
0


డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి న‌టిస్తోన్న తాజా చిత్రం రొమాంటిక్. మెహ‌బూబా సినిమా పై ఆకాష్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు కానీ..ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. దీంతో ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో రొమాంటిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి పూరి క‌థ – మాట‌లు అందించారు. అయితే…ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను మాత్రం త‌న‌ శిష్యుడు అనిల్ పాడూరికి అప్ప‌గించారు.

వైవిధ్య‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందే ఈ సినిమా ప్ర‌స్తుతం గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో కథానాయికగా కేతిక శర్మను ఎంపిక చేసారు. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని ఛార్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. కేతిక శర్మ ఫొటోను షేర్ చేసారు. తెలుగులో ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ఈ క‌థానాయిక‌ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here