Home Actor ఆక‌ట్టుకుంటున్న సాహో పార్టీ సాంగ్ సైకో స‌య్యా..!

ఆక‌ట్టుకుంటున్న సాహో పార్టీ సాంగ్ సైకో స‌య్యా..!

76
0
ఆక‌ట్టుకుంటున్న సాహో పార్టీ సాంగ్ సైకో స‌య్యా..! spiceandhra

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – యువ దర్శకుడు సుజీత్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో.  ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ బ్యాన‌ర్ పై వంశీ, ప్రమోద్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.  ఈ రోజు ఈ చిత్రంలోని  ‘సైకో సయ్యా’ అనే పల్లవితో సాగే సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ లో  ప్రభాస్ మరియు శ్రద్ధ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక వారు చేసిన డాన్స్ మూమెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ వీడియో ప్రస్తుతం విడుదలైన అన్నిభాషల్లోనూ అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. రాజు సుందరం, వైభవి మర్చంట్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఈ పార్టీ సాంగ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా ఆగ‌ష్టు 15న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయున్నారు. బాహుబ‌లితో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌భాస్…సాహో సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here