Home News ఆదోనిలో జ‌న‌సేన అత్య‌ధిక మెజార్టీతో జెండా ఎగ‌రేయ‌డం ఖాయం – జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌..!

ఆదోనిలో జ‌న‌సేన అత్య‌ధిక మెజార్టీతో జెండా ఎగ‌రేయ‌డం ఖాయం – జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌..!

78
0


క‌ర్నూలు జిల్లా ఆదోనిలో గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధుల్లో నిర్ల‌క్ష్యం నిండుగా క‌నిపిస్తుంది. ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. అలాగే వ్య‌వ‌సాయ రంగం కుంటిపడింది. వీటి గురించి ఎప్పుడూ.. అధికారుల‌తో మాట్లాడింది లేదు. ప్ర‌భుత్వంతో మాట్లాడింది లేదు. అసెంబ్లీలో ఆదోని నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాట్లాడిన దాఖ‌లాలు కూడా లేవు అని ఆదోని నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తున్న మ‌ల్ల‌ప్ప విమ‌ర్శించారు.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మ‌ల్ల‌ప్ప మాట్లాడుతూ… ఈ రోజు ఆదోనిలో ట్రాఫిక్ స‌మ‌స్య ఎలా ఉందంటే…ట్రాఫిక్ వ‌ల్లే ప్రాణాలు కోల్పేయే ప‌రిస్థితి ఉంది. బైపాస్ రోడ్డు క‌నుక మ‌నం చూసిన‌ట్లైతే… 12 ఏళ్ల నుంచి బైపాస్ రోడ్డు ప‌నులు అసంపూర్ణంగా మ‌ధ్య‌లోనే నిలిపేసారు. ఇదే కాకుండా… తాగునీటి స‌మస్య‌ను తీర్చ‌డానికి ఉన్న‌టువంటి రామ్జ‌ల చెరువును కూడా ఎండ‌బెట్టారు.

డిగ్రీ కాలేజీ కోసం పేద విద్యార్ధులు 20 ఏళ్లుగా పోరాటాలు చేస్తే ఎల‌క్ష‌న్ టైమ్ లో జీఓ ప్ర‌వేశ‌పెట్టారు. కేవ‌లం హామీల‌కు ప‌రిమితం అయ్యారు ఈ ప్ర‌జాప్ర‌తినిధులు. వాళ్లు గ‌ట్టి నాయ‌కులు..వాళ్ల‌ను నుంచి పోటీని ఎలా త‌ట్టుకోగ‌ల‌రు అనే వారికి చెప్పేది ఏంటంటే…ఇక్క‌డ ప్ర‌జ‌ల విష‌యంలో త‌ప్పు చేసిన వాళ్లు ఎవ‌రైనా కానీ…చిన్న నాయ‌కులే. ప్ర‌జ‌ల‌ను చిత్త‌శుద్ధితో పాలించే వాళ్లే గొప్ప నాయ‌కులు. అటువంటి గొప్ప నాయ‌క‌త్వం జ‌న‌సేన పార్టీలో ఉది. త‌ప్ప‌కుండా జ‌న‌సేన పార్టీ ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక మెజార్టీతో జెండా ఎగ‌రేస్తుంద‌ని తెలియ‌చేస్తున్నాను అన్నారు.

ఆదోని ప్రాంతంలో కులాల‌కు అతీతంగా..మ‌తాల‌కు అతీతంగా..రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. అందుచేత కులాల‌కు, మాతాల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా సేవ చేయాల‌నే సంక‌ల్పంతో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాను. ప్ర‌జ‌లు నిజంగానే నిర్ల‌క్షానికి గుర‌వుతున్నారు. కొంత‌మంది నాయ‌కులు కులాల్ని వాడుకుంటున్నారు. కొంత మంది నాయ‌కులు కులాల్ని దూషిస్తున్నారు. వారు ఎన్నిక‌ల టైమ్ లో క‌ప‌ట‌ప్రేమ‌ను చూపిస్తున్నారు. అందుకే మేము ఖ‌చ్చితంగా తెలియచేసేది ఏంటంటే…జ‌నం మ‌ధ్య తిరిగి జ‌నం క‌ష్టాలు తెలిసిన వాళ్ళం కాబ‌ట్టి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మా జ‌న‌సేన పార్టీ ముందుకు సాగుతుంది. 20 ఏళ్లుగా వెన‌క‌బ‌డిన ఆదోని నియోజ‌క‌వ‌ర్గాన్ని 5 ఏళ్ల‌లో అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని మాట ఇస్తున్నాను అని మ‌ల్ల‌ప్ప చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here