Home News ఆదోనిలో హోరెత్తిన జ‌న‌సేన ప్ర‌చారం..!

ఆదోనిలో హోరెత్తిన జ‌న‌సేన ప్ర‌చారం..!

84
0


ఆదోని అసెంబ్లీ జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌ను గెలిపించాల‌ని కోరుతూ…క‌ర్నూలు పార్ల‌మెంట్ సీపీఎం అభ్య‌ర్ధి కె ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆదోనిలో ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేసారు. ఆదోని ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్ లో ఇంటింటి ప్ర‌చారంలో… సీపీఎం పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి గుర్తు సుత్తి కొడ‌వ‌లి న‌క్ష‌త్రం, జ‌న‌సేన అభ్య‌ర్ధి గుర్తు గ్లాసు పై ఓట్లు వేసి గెలిపించాల‌ని క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేసారు. పెరుగుతున్న ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆదోనిలో రోడ్ల విస్తీర‌ణం చేప‌ట్టి పెండింగ్ బైపాస్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని వామ‌ప‌క్ష ప్ర‌జా సంఘాల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేస్తున్నా ఫ‌లితం లేద‌న్నారు.

జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప మాట్లాడుతూ…ప‌ట్ట‌ణంలోని ద‌ళితులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో రోడ్లు, మురికి కాల‌వ‌లు వీధి లైట్ల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. రెండో ముంబాయిగా పేరుగాంచిన ఆదోని లో ఉన్న స్పిన్నింగ్ & జిన్నింగ్ ఆయిల్ ప‌రిశ్ర‌మ‌లు అక్ర‌మ లాకౌట్ల‌కు గురికావ‌డంతో వేలాది మంది కార్మికుల‌కు ఉపాధి కోల్పోయి వీధుల‌పాలు కావాల్సి వ‌చ్చింద‌న్నారు. మూసివేసిన ప‌రిశ్ర‌మ‌ల‌ను తెరిపించి కార్మికుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామంటూ గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి గెలిచిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఐదేళ్లు పూర్తైనా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

 ఆదోనిలో ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల లేక‌పోవ‌డంతో పేద విద్యార్ధుల‌కు ఉన్న‌త విద్య అంద‌ని ద్రాక్ష‌లా మారింది. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జ‌న‌సేన పార్టీ గుర్తు గ్లాసు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళా సంఘం జిల్లా నాయ‌కురాలు ర‌త్న‌మ్మ‌, జ‌న‌సేన అభ్య‌ర్థి మ‌ల్ల‌ప్ప స‌తీమ‌ణి స్వ‌ప్న‌, సీపీఎం రాష్ట్ర క‌మిటీ స‌భ్యులు పెద్ద‌రెడ్డి, ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి డి.ల‌క్ష్మ‌న్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here