Home News ఆదోని అభివృద్ధి చెందాలంటే జ‌న‌సేన‌ని గెలిపించాలి – ఆదోని జ‌నసేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌

ఆదోని అభివృద్ధి చెందాలంటే జ‌న‌సేన‌ని గెలిపించాలి – ఆదోని జ‌నసేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌

82
0


ఆదోని నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తోన్న య‌న్.మ‌ల్ల‌ప్ప  ప్ర‌త్య‌ర్ధుల కంటే స్పీడుగా ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌ను క‌లుపుని వీధివీధికి తిరుగుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆదోని మ‌రింత‌గా అభివృద్ధి చెందాల‌న్నా…ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రావాల‌న్నా..జ‌న‌సేన పార్టీ గెల‌వాల‌ని..అందుచేత గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలి అంటూ విస్త్రృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. 

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా య‌న్.మ‌ల్ల‌ప్ప మాట్లాడుతూ…జ‌న‌సేన‌, సీపీఐ, బీఎస్పీ క‌లిసి చేస్తోన్న ఈ యుద్ధానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ ఉండాల‌ని నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దించి అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని ఆదోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాను. ఆదోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జా దేవుళ్లు ఆలోచించి మంచి నిర్ణ‌యం తీసుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంది. 25 ఏళ్లుగా ఆదోని అభివృద్ధిని నిర్ల‌క్ష్యం చేస్తోన్న రాజ‌కీయ నాయ‌కుల‌కు బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు ఉంటాయి. అభివృద్ధే ధ్యేయంగా మీ ముందుకు వ‌స్తోన్న జ‌న‌సేన‌ కూట‌మికి ప్ర‌తి ఒక్క‌రు ఆశీర్వ‌దించి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here