Home News ఆదోని ప్ర‌జ‌ల ఆశీర్వాద బ‌లంతో జ‌న‌సేన జెండాను ఎగ‌ర‌వేస్తాం – జ‌న‌సేన ఆదోని అసెంబ్లీ అభ్య‌ర్ధి...

ఆదోని ప్ర‌జ‌ల ఆశీర్వాద బ‌లంతో జ‌న‌సేన జెండాను ఎగ‌ర‌వేస్తాం – జ‌న‌సేన ఆదోని అసెంబ్లీ అభ్య‌ర్ధి య‌న్.మ‌ల్ల‌ప్ప‌

101
0


ప్ర‌జ‌ల అభిమానం, ఆద‌ర‌ణ చూస్తుంటే…ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని జ‌న‌సేన పార్టీ ఆదోని అసెంబ్లీ అభ్య‌ర్ధి య‌న్.మ‌ల్ల‌ప్ప ధీమా వ్య‌క్తం చేసారు. ఆయ‌న కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో క‌లిసి ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్ల‌ప్ప మాట్లాడుతూ…ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన‌టువంటి మీనాక్షి నాయుడు గారు, సాయిప్ర‌సాద్ రెడ్డి గారు వారు ప‌ర్సంటేజీల‌కు ప‌రిమిత‌మైనార‌ని ప్ర‌జ‌లు కూడా స్ప‌ష్టంగా తెలియ‌చేస్తున్నారు. అందుచేత మూడ‌వ ప్ర‌త్యామ్నాయ పార్టీగా జ‌న‌సేన గెల‌వాల‌ని నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దిస్తున్నారు.

25 ఏళ్లుగా వెన‌క‌బ‌డి ఉన్న‌టువంటి ఈ ఆదోని నియోజ‌క‌వ‌ర్గాన్ని జ‌న‌సేన పార్టీ గెలిచిన త‌ర్వాత తిరిగి సెకండ్ బొంబాయిగా తీర్చిదిద్దుతాన‌ని మాట ఇస్తున్నాను.  ప‌రిశ్ర‌మ‌లు అయితేనేమీ, వ్య‌వ‌సాయం అయితేనేమీ, విద్యార్ధుల స‌మ‌స్యలు అయితేనేమీ, మౌళిక వ‌స‌తుల స‌మ‌స్య‌లు అయితేనేమీ…ఇలా ప్ర‌తి ఒక్క స‌మ‌స్య‌ను తీరుస్తామ‌ని ఆదోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు జ‌న‌సేన పార్టీ త‌రుపున హామీ ఇస్తున్నాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి నాయ‌క‌త్వాన్ని ప్ర‌తి ఒక్క‌రు స్వాగ‌తిస్తున్నారు. ఎందుకంటే త‌ను ప్ర‌జ‌ల కోసం స‌ర్వశ్వాన్ని వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

ఆయ‌న ఇప్పుడు ఉన్న‌టువంటి కుళ్లు, కుట్ర, కుతంత్రాల రాజ‌కీయాలను రూపుమాపాల‌ని జ‌న‌సేన పార్టీని స్ధాపించారు. అందుక‌నే ప్ర‌జ‌లంద‌రూ పెద్ద ఎత్తున ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలియచేస్తున్నారు. రాష్ట్రానికి నీతి, నీజాయితి, నిబ‌ద్ధ‌త క‌లిగిన‌టువంటి నాయ‌కుడు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల ఆశీర్వాద బ‌లంతో జ‌న‌సేన జెండాను ఎగ‌రేస్తాం అని మ‌ల్ల‌ప్ప తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here