Home Actor ఆనంద్.. అన్నగా గర్వపడుతున్నా – దొర‌సాని వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఆనంద్.. అన్నగా గర్వపడుతున్నా – దొర‌సాని వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

101
0
ఆనంద్.. అన్నగా గర్వపడుతున్నా - దొర‌సావి వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ spiceandhra

ఆనంద్ దేవ‌ర‌కొండ – శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం దొర‌సాని. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ నెల 12న దొరసాని ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా  జె ఆర్ సి లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఘనంగా జ‌రిగింది. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో దొరసాని ఆడియో జూక్‌ బాక్స్‌ను రాజశేఖర్‌ విడుదల చేయగా బిగ్‌ టికెట్‌ని క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు.

సందర్భంగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ  మాట్లాడుతూ … “ఇది కేవీఆర్‌ మహేంద్ర, ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌ ఫంక్షన్ ఇది. సినిమా చేస్తానన్నప్పటి నుంచి నేను ఆనంద్‌తో పెద్దగా మాట్లాడలేదు. వాడి ముందు మాట్లాడాలనే ఇప్పుడు మాట్లాడుతున్నా. స్కూల్ టైమ్ నుండే నా దోస్తులందరూ వీడికి దోస్తులయ్యారు. అప్పటి నుంచి నేనేం చేస్తే వాడు అది చేయడం అలవాటైపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ చదివి యుఎస్‌లో డెలాయిట్‌లో ఉద్యోగం చేశాడు. అలాంటి వాడు ఉద్యోగం మానేసి ఇండియాకు రావడం నాకు నచ్చలేదు. లేదు. ఇక్కడ నేను పది పనులు చేస్తున్నా, రౌడీస్‌ చూసుకుంటా అని అన్నాడు. సరే రమ్మన్నాను. అలాంటి సమయంలో ఒక రోజు క‌థ‌ విన్నా, సినిమా చేస్తా అన్నాడు. అది నాకు నచ్చలేదు.

‘అరె యాక్టింగ్ అంటే మాటలు కాదురా. సడన్ గా వచ్చి ఎట్ల చేస్తావు. మజాకనుకున్నావా?’ అని అన్నా. కానీ మా వాడు చాలా ఫిక్సయ్యాడు. ఇక నేనేమీ అనగలను. ‘సరే చేసుకో. ఇక నీ సినిమా గురించి నన్ను అడక్కు’ అని అన్నా. ఆ రోజు నుంచి వాడి సినిమా గురించి వాడితో నేనేమీ అడగలేదు. ఇప్పటి దాకా వాడి సినిమా గురించి అడగలేదు. ఎందుకంటే నీళ్లల్లో పడేస్తేనే స్విమ్మింగ్‌ చేస్తారా లేకుంటే మునిగిపోతారా తేలిపోతుంది దెబ్బకి. ఒక సినిమా క‌థ‌ చేయడం దగ్గరి నుంచి థియేటర్‌కి తీసుకుని వచ్చే వరకు ఎంత కష్టముంటుందో వాడికి తెలియాలని నేను వదిలేశాను వాడిని. ఆనంద్‌ యు.ఎస్‌.కివెళ్లి జాబ్‌ చేస్తూ ఇంటికి డబ్బులు పంపించి హెల్ప్‌ చేశావు. నువ్వు అలా చేసినందువల్ల నాకు చాలా సాయం జరిగింది. ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నందుకు అది చాలా ఉపయోగపడింది.

నాలో ప్రెజర్‌ తీసేసింది. అలాంటి వ్యక్తి అన్నీ వదిలేసి యాక్టింగ్‌ చేస్తానని వచ్చాడు. నేను మాట్లాడలేదు. వాడే ఏదో వాడికి నచ్చినట్టు సేవింగ్స్‌తోనే జిమ్‌లకు వెళ్లాడు. ట్రైనింగ్‌కి వెళ్లాడు. నేను సినిమా చేసుకుంటున్నా. ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం కాకినాడలో ఉన్నా. నా ఫ్రెండ్స్‌ అందరూ ‘ఆనంద్‌ సినిమా చేస్తున్నాడా’ అని అడుగుతుంటే ‘నాకు తెలియదు బై. వాడే చేసుకుంటున్నాడు ’ అని అన్నా. సినిమా ప్రమోషన్స్ వరకూ వచ్చింది. తన పూజకి వెళ్లాలనిపించింది. కానీ ఆపుకున్నా. నీ టీజర్‌ చేయాలని షేర్‌ చేయాలనిపించింది. కానీ ఆపుకున్నా. చాలా పాటలు నాకు ఇష్టం షేర్‌ చేయాలనిపించింది. అయినా ఆపుకున్నా. ఎందుకంటే మీరు అబ్యూస్‌ అవ్వడం, ట్రోలింగ్‌ తీసుకోవడం వంటివన్నీ కొత్తవారిగా తెలుసుకోవాలని. అవన్నీ తట్టుకోగలిగితేనే ఇండస్ట్రీలో సర్వైవ్‌ కాగలరు. నిజంగా అలాంటి సందర్భాలని తట్టుకుని నిలబడటం చూశా.

 నీ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడాన్నీ గమనించాను. మొన్న సినిమా చూశా. మహేంద్ర, సందీప్‌ కొరపాటి, శివాత్మిక, ఆనంద్‌.. వీళ్లందరూ కలిసి చేసిన పని చూసి చాలా గర్వపడ్డా. సడన్ గా యు.ఎస్‌ నుంచి వచ్చి సినిమా చేస్తానన్నాడు. శివాత్మిక చిన్నపిల్ల. కానీ వాళ్లు చేసింది చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. మహేంద్ర చిన్న డైలాగు కూడా చెప్పకుండా, యాక్టర్లతో ఎన్నో ఎమోషన్స్ చెప్పించాడు. ఆ పెర్ఫార్మెన్సతో అలా చెప్పించడం చాలా బాగా ఉంది. చిన్న బడ్జెట్‌లో క్లాసిక్‌ లుక్‌ వచ్చేసింది. ప్రశాంత విహారీ సంగీతం చాలా బావుంది. శివాత్మిక వన్ ఆఫ్‌ ద బెస్ట్‌ యాక్ట్రేస్. ఆ అమ్మాయి సింగిల్‌ టేక్‌ సీన్ ఉంది పోలీస్‌ స్టేషనలో.. అది చాలా బాగా చేసింది. లోపల ఎంతో ఫీల్‌ అయితేగానీ నువ్వు అంత బాగా చేయలేవు. ఆమె పెర్ఫార్మెన్స సుపీరియర్‌.

ఆనంద్‌ గురించి నేను చెప్పను. ఓ అన్నగా గర్వపడుతున్నా. తను పడ్డ కష్టం చూశా. చాలా సర్‌ప్రైజ్‌ అయ్యా. క‌థ నుంచి, ప్రతిదీ చాలా బావుంది. మహేంద్ర నా కోసం క‌థ‌ రాస్తున్నాడని తెలిసింది. అది రెడీ కాగానే నేనువింటాను. నా గురువు గారు వినయ్‌వర్మ ఇక్కడున్నారు. ఈ ఇండ స్త్రీ కాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మిమ్మల్ని (హీరో, హీరోయిన్లను) ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. మెచ్చుకుంటారు. తిడుతారు. నా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ డైరక్టర్‌ నాగ్‌ అశ్విన్ ఇదే విషయాన్ని నాకు చెప్పాడు. నేనప్పుడు లో ఫేస్‌లో ఉన్నా. అది నాకు వర్క్‌ అయింది. మీకు కూడా అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమా వెనుక చాలా మంది మంచి వారున్నారు. ఈ సినిమా ప్యూర్‌ స్టోరీ టెల్లింగ్‌. నిజ జీవితాల మీద బేస్‌ అయింది. అందుకే ఆ కథ చాలా బావుంది. జూలై 12 ‘దొరసాని’ చాలా బావుంటుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here