Home Actor ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను – మ‌హేష్ బాబు..!

ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను – మ‌హేష్ బాబు..!

63
0

 ఆంధ్రా హాస్పిటల్స్ నుండి ఒకాయన వచ్చి అన్నారు పిల్లలకి సర్జరీ చేసే ముందు మీ పేరు చెబితే నవ్వుతారు అని. దీని కన్నా గొప్ప కాంప్లిమెంట్ నేను వినలేదు. అలాగే హైదరబాద్లోని హీల్ ఏ చైల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారు కూడా సంవత్సరానికి ఎంత మంది పిల్లలను కాపాడుతారు. మీతో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషం అని సూపర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి విజ‌యోత్స‌వంలో అన్నారు. ఈ సంద‌ర్భంగా మహేష్ మాట్లాడుతూ…. విజయవాడ వచ్చి ఆ కనక దుర్గ ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు.

నా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడల్లా ఆ తల్లే నన్ను ఇక్కడికి పిలుస్తది. ముందుగా మామయ్య  రాఘవేంద్రరావు గారికి థాంక్స్. ఎందుకంటే ఆయనతో సినిమా చేసినప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ లా చూసుకున్నారు. ఆ రోజే ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దీ.నువ్వు పెద్ద సూపర్ స్టార్ వి అవుతావు అని చెప్పారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వైజయంతి బ్యానర్, దిల్ రాజు బ్యానర్, పి వి పి బ్యానర్. ముగ్గురు కలిసి నా 25 సినిమాను ప్రొడ్యూస్ చెయ్యడం అలానే దత్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా 25 వ సినిమా కూడా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది.

నరేష్ గారూ, పూజ గారు అందరూ నాకు ఎప్పటికీ స్పెషల్. ఈ సినిమా డెహ్రాడూన్ లో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడే చెప్పా. ఈ సినిమా పోకిరి స్క్వేర్ అవుద్ది అని. ఈ మూడు క్యారెక్టర్స్ లో స్టూడెంట్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది ఎప్పుడూ మర్చి పోలేని కిక్ ఇచ్చింది. గురు స్వామి గారి ఆశీస్సుల వల్లె ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఇక నాన్న గారి అభిమానులందరూ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే….మీకు సినిమా నచ్చితే ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. కానీ నా 25వ సినిమా అన్ని బ్లాక్ బస్టర్ నీ ఒక వారంలో దాటించారు చూసారా… సలాం మీ అందరికీ ..మీ గురించి నేను ఎప్పుడూ చెప్పేది చేసేది ఒక్కటే చేతులెత్తి దండం పెట్టడం థాంక్స్” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here