Home Actor ఆర్ఆర్ఆర్ చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా..? దీనికి బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ రియాక్ష‌న్..?

ఆర్ఆర్ఆర్ చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా..? దీనికి బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ రియాక్ష‌న్..?

80
0


ఆర్ఆర్ఆర్..ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లేటెస్ట్ మూవీ టైటిల్ ఇది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టార‌ర్ సెకండ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వ‌ర‌లో థ‌ర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నారు. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2020లో జులై 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

ఈ మూవీ గురించి బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…జులై 30 వ‌ర‌కు వెయిట్ చేయ‌లేక‌పోతున్నాను. బాహుబ‌లి సినిమా కోసం అభిమానులు ఎంత‌లా ఎదురు చూసారో నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది.  ఆర్ఆర్ఆర్ టీజ‌ర్ కానీ..ట్రైల‌ర్ కానీ..ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? ఇప్పుడు నేను అభిమాని స్ధానంలో ఉండి అడ‌గ‌డం న‌చ్చింది అన్నారు. అయితే…శోభు ట్వీట్ కు ఓ నెటిజ‌న్.. నిర్మాత‌గా..ఆర్ ఆర్ఆర్ వాయిదా ప‌డ‌కుండా చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందని న‌మ్మ‌కం ఉందా అని అడిగారు.

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు శోభు స్పందిస్తూ…నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా ఎలాంటి వాయిదాలు లేకుండా ఖ‌చ్చితంగా జులై 30నే విడుదల అవుతుంది. బాహుబలి 2  కూడా వాయిదా పడకుండా ముందుగా చెప్పిన డేట్ కే రిలీజ్ అయ్యింది కదా..అని చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here