Home Actor ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో రాజ‌మౌళి ఏం మాట్లాడ‌బోతున్నారు..?

ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో రాజ‌మౌళి ఏం మాట్లాడ‌బోతున్నారు..?

82
0


ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ (వ‌ర్కింగ్ టైటిల్). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. సుద్దాల అశోక్ తేజ్ పాట‌లు రాస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ క్రేజీ మూవీ స్టోరీ ఇదే అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

అయితే…ప్ర‌చారంలో ఉన్న ఈ క‌థ‌ల‌కు రేపు ఫుల్ స్టాప్ ప‌డ‌బోతుంది. ఎందుకంటే..రేపు ఉద‌యం 11.30 నిమిషాల‌కు హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లోఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ లో రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ పాల్గొంటారు. దీంతో రాజ‌మౌళి ఏం మాట్లాడ‌బోతున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌గ‌ధీర సినిమా టైమ్ లో ఇది పున‌ర్జ‌న్మ‌ల క‌థ అని ముందే చెప్పేసారు. ఆత‌ర్వాత ఈగ‌, మ‌ర్యాద రామ‌న్న సినిమాల‌కు సంబంధించి క‌థ ముందే చెప్పేసారు. అందుచేత ఆర్ఆర్ఆర్ స్టోరీ లైన్ కూడా రేపు జ‌రిగే ప్రెస్ మీట్ లో చెప్ప‌నున్నారని..హీరోయిన్స్ ఎవ‌ర‌నేది కూడా అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here