Home Actor ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

57
0
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? spiceandhra

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్  రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. డి.వి.వి దాన‌య్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన అలియా భట్‌, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. డైసీ జోన్స్ కొన్ని కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

దీంతో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం అన్వేషించి ఫైన‌ల్ గా అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్ ను ఫైనల్ చేశారని తెలిసింది. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఎమ్మాకు ఇదే తొలి భారతీయ చిత్రం. ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల నటి ఆలియా భట్ నటిస్తుంది. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ సినిమాని జులై 30, 2020న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here