Home Actor ఆర్ఎక్స్ 100 కార్తికేయ న్యూమూవీ టైటిల్ ఎనౌన్స్ మెంట్..!

ఆర్ఎక్స్ 100 కార్తికేయ న్యూమూవీ టైటిల్ ఎనౌన్స్ మెంట్..!

93
0

ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ని బాగా ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు కార్తికేయ‌.  కార్తికేయ రెండవ సినిమా హిప్పీ. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవ‌ల టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా జూన్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం కార్తికేయ మూడ‌వ చిత్రం చేస్తున్నాడు.

నూత‌న ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ రేపు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం 12:06 గంటలకు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు హీరో కార్తికేయ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here