Home Telugu ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ గురించి వ‌ర్మ షాకింగ్ కామెంట్స్..!

ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ గురించి వ‌ర్మ షాకింగ్ కామెంట్స్..!

169
0
Varma Comments about RX 100

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 చిత్రం టీజ‌ర్ రిలీజైన‌ప్ప‌టి నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక ఈనెల 12న థియేట‌ర్లోకి వ‌చ్చిన ఆర్ఎక్స్ 100…యూత్ ని బాగా ఆక‌ట్టుకోవ‌డంతో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. దీంతో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఏర్ప‌డింది. నాలుగు పెద్ద నిర్మాణ సంస్థ‌లు ఈ డైరెక్ట‌ర్ కి అడ్వాన్స్ లు ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఇదిలా ఉంటే…ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అజయ్ భూప‌తి రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు.  ఈ సంద‌ర్భంగా వ‌ర్మ ఫేస్ బుక్ లో స్పందిస్తూ…ఆర్ఎక్స్ 100 సినిమాని చూసేందుకు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల వైపుకు ప‌రుగులు పెట్టించావ్ అంటూ త‌న శిష్య‌డు అజ‌య్ భూప‌తిని అభినందించాడు. అంతే కాకుండా…త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా వ‌ర్క్ చేసిన అజ‌య్ భూప‌తి ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా వ‌ర్క్ చేయాల‌ని వుంద‌ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు వ‌ర్మ‌.  ప్రస్తుతం వర్మ గెహెర్‌, రాయ్‌ అనే హిందీ సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here