Home Actor ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసాడా..?

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసాడా..?

67
0
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసాడా..? spiceandhra

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యం సాధించ‌డంతో అజ‌య్ భూప‌తితో సినిమా చేసేందుకు యువ హీరోలు రామ్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్..ఆస‌క్తి చూపించారు. అయితే..ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ యువ హీరోలు వెన‌క‌డుగు వేయ‌డంతో మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ మూవీ టైటిల్ మ‌హా స‌ముద్రం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో ర‌వితేజ‌తో పాటు మ‌రో హీరో కూడా న‌టించ‌నున్నాడ‌ట‌. ఇంత‌కీ… ఆ హీరో ఎవ‌రంటారా..?  బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకున్న యువ హీరో సిద్ధార్ధ‌. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో న‌టించినా..ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఇటీవ‌ల గృహం సినిమాతో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్నాడు.

డిఫ‌రెంట్ గా ఉన్న ఈ క‌థ ర‌వితేజ‌, సిద్ధార్ధ ఇద్ద‌రికీ న‌చ్చి ఓ కే చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జెమిని కిర‌ణ్ ఈ సినిమాని నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా అదితిరావు హైదరీ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట.  సిద్ధార్థ్ కు జోడీని ఎంపిక చేయాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here