Home Actor ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ మూవీ టైటిల్ ఇదే.!

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ మూవీ టైటిల్ ఇదే.!

63
0

ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ని బాగా ఆక‌ట్టుకుని… సంచ‌ల‌న విజ‌యం సాధించి..సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో కార్తికేయ‌. ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో కార్తికేయ‌తో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. సెకండ్ మూవీగా హిప్పీ  చేస్తున్నాడు. జూన్ 7న ఈ సినిమా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మూడ‌వ సినిమాగా నూత‌న ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రానికి గుణ 369 అనే టైటిల్ ఖ‌రారు చేసారు. డిఫ‌రెంట్ గా ఉన్న ఈ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా డిఫ‌రెంట్..ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ఈ మూవీ టైటిల్ గురించి హీరో కార్తికేయ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ఈ చిత్రంలో నా పేరు గుణ‌. మ‌రి 369..?  ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నారు. సోష‌ల్ మీడియాలో ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.  రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

స్ప్రింట్ ఫిల్మ్స్.. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టైటిల్ & పోస్ట‌ర్ ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. మ‌రి…ఈ సినిమాతో కూడా స‌క్స‌స్ సాధిస్తాడేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here