Home Political News ఆర్టీసీ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద ప్ర‌మాదం – 52 మంది మృతి..!

ఆర్టీసీ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద ప్ర‌మాదం – 52 మంది మృతి..!

104
0

జ‌గిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు వ‌ద్ద జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 52కి చేరుకుంది. ఆర్టీసీ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ప్ర‌మాదం ఇది. బ‌స్సులో దాదాపు 80 మంది ఉన్నార‌ని స‌మాచారం. డ్రైవ‌ర్ శ్రీనివాస్ మృతి చెంద‌గా, కండెక్ట‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. 14 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాద మృతుల్లో 25 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. ఈ ప్ర‌మాదం పై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసి గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

కేటిఆర్, క‌విత హెలికాఫ్ట‌ర్ లో వెళ్లి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు జగిత్యాల, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 52 మంది చనిపోవడం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ సంతాపం తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here