Home Actor ఆర్ధికంగా వెన‌క‌బ‌డిన ముస్లింల‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంది – ప‌వ‌న్ క ళ్యాణ్

ఆర్ధికంగా వెన‌క‌బ‌డిన ముస్లింల‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంది – ప‌వ‌న్ క ళ్యాణ్

93
0


రాయ‌ల‌సీమ‌తో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలు తీవ్ర‌మైన వెనుక‌బాటుకి గుర‌య్యాయి. ఆర్ధికంగా వెనుక‌బ‌డిన ముస్లింలకు జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంది. ముస్లిం మ‌హిళ‌లకు ఆర్ధిక ఆస‌రా కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను తీసుకొస్తాం అని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. వారిని మిగ‌తా పార్టీల్లా ఓటు బ్యాంకుగా మాత్ర‌మే ఉప‌యోగించుకుంటున్నాయి. ఇపుడు దేశంలో హిందువులు, క్రైస్త‌వులు, ముస్లింలు అంతా దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు దేశ‌భ‌క్తి చూపిస్తాం త‌ప్ప .. ఎవ‌రో అడిగార‌ని దేశ‌భ‌క్తిని చూప‌న‌వ‌స‌రంలేదు.

ముస్లింల అభివృద్దికి, అభ్యున్న‌తికీ జ‌న‌సేన పార్టీ కట్టుబ‌డి ఉంటుంది. బ‌డుగు, బ‌ల‌హీన‌, మైనార్టీ హ‌క్కుల కోసం జ‌న‌సేన బ‌ల‌మైన‌ పోరాటం చేస్తుంది.  పోర్టు కోసం ఉన్న ఫిష్షింగ్ హార్బ‌ర్ తొల‌గించేశారు. కావ‌లి తీర ప్రాంతంలో దాన్ని నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. చిన్న‌పాటి ఫిషింగ్ హార్బ‌ర్ కోసం మ‌త్స్య‌కారులు ఏళ్ల త‌ర‌బ‌డి దేహీ అని అడుక్కోవాల్సిన ప‌రిస్థితి. పాల‌కులు, అధికారుల‌కు ఎన్నిసార్లు విన్న‌వించుకున్న ప‌ట్టించుకోలేదు. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధిని చ‌ట్ట స‌భ‌కి పంపండి.  జ‌న‌సేన ప్ర‌భుత్వంలో మ‌త్స్య‌కారులు ఎవ‌రిని దేహీ అని అడగాల్సిన అవ‌స‌రం లేదు. మీ స‌మ‌స్య‌లు నాకు తెలుసు. ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే ఒక్కొక్క స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేస్తాం.

* రూ.. వేల కోట్లు దోచేస్తున్నారు

 నాకు డ‌బ్బు మీద వ్యామోహం లేదు. సంపాదించిన డ‌బ్బునే పంచేసిన వాడిని, నేను ముఖ్య‌మంత్రి అయితే ఉన్న సంప‌ద‌ని అన్ని వ‌ర్గాల‌కీ స‌మంగా పంచిపెట్టే వ్య‌క్తినేగానీ, వేల కోట్లు దోచుకునే వ్య‌క్తిని కాదు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ముఖ్య‌మంత్రి, మంత్రులు ప్ర‌భుత్వాన్ని న‌డిపించే ధ‌ర్మ‌క‌ర్త‌లు. క్యాబినెట్ అంటే ధ‌ర్మ‌క‌ర్త‌ల స‌ముహాం. మ‌రి అలాంటి వారు వేల‌కోట్లు దోచుకుంటున్నారు. చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ రావడానికి కూడా మన మత్స్యకారులు దేహీ అని అడగాల్సిన పరిస్థితి. నేను ముఖ్య‌మంత్రిని అయితే వేల‌కోట్లు వెన‌కేసుకునే వాడిని కాదు. ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టే వాడిని. ఇక్క‌డ కూర్చొని మీకు అందుబాటులో ఉండే వ్య‌క్తుల‌నే గెలిపించండి అన్నారు. 

* ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన జ‌న‌సేనాని పోరాట‌యాత్ర

జ‌న‌సేన పోరాట‌యాత్ర‌లో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సోమ‌వారం ప్ర‌కాశం జిల్లాకి చేరుకున్నారు. అంత‌కు ముందు నెల్లూరులో పార్టీ శ్రేణులు, విద్యార్ధుల‌తో స‌మావేశాల అనంత‌రం భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఆయ‌న బ‌స చేసిన క‌ళ్యాణ‌మంట‌పం నుంచే వేలాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు బైక్‌ల‌తో ర్యాలీ తీయ‌గా రోడ్ షో నిర్వ‌హించారు. స్థానిక విఆర్‌సి స‌ర్కిల్ వ‌ర‌కు సాగిన ఈ రోడ్ షోకి త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సైనికులు, అభిమానుల‌తో నెల్లూరు న‌గ‌రం కిక్కిరిసింది. 

పూల వ‌ర్షం కురిపిస్తూ నెల్లూరు నుంచి ఆయ‌న్ని సాగ‌నంపారు. అనంత‌రం జాతీయ ర‌హ‌దారి పొడవునా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి హార‌తుల‌తో స్వాగ‌తం ప‌లికారు. నెల్లూరు నుంచి కావలి మీదుగా జ‌న‌సేనాని ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌వేశించారు. మంగ‌మూరు రోడ్డు వ‌ద్ద వేలాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని ఒంగోలు న‌గ‌రంలోకి ఆహ్వానించారు. అక్క‌డి నుంచి పూలాభిషేకం చేస్తూ పుర‌వీధుల్లో ఊరేగిస్తూ బ‌హిరంగ స‌భా ప్రాంగ‌ణం చ‌ర్చి సెంట‌ర్ వ‌ద్ద‌కి తీసుకువెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here