Home Actor ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌ర‌శురామ్. ఇంత‌కీ సినిమా ఎప్పుడు..?

ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌ర‌శురామ్. ఇంత‌కీ సినిమా ఎప్పుడు..?

40
0
ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌ర‌శురామ్. ఇంత‌కీ సినిమా ఎప్పుడు..? spiceandhra

గీత గోవిందం సినిమాతో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని సంచ‌ల‌న  విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్. ఈ సినిమా త‌ర్వాత ప‌ర‌శురామ్ తో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాత‌లు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు. అయితే… గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాల్సి ఉండ‌డంతో ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రం గీతా ఆర్ట్స్ లోనే ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే…ప‌ర‌శురామ్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి క‌థ చెప్పడం..క‌థ విని మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది. అనిల్ రావిపూడితో మ‌హేష్ చేస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత ప‌ర‌శురామ్ తో సినిమా ఉండ‌చ్చు అనుకున్నారు కానీ..మ‌హ‌ర్షి సినిమాతో బాగా ద‌గ్గ‌రైన వంశీ పైడిప‌ల్లితోనే మ‌హేష్ మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

క‌థ రెడీ చేయ్ మ‌నం క‌లిసి మ‌రో సినిమా చేద్దాం అని మ‌హేష్ అన‌డంతో.. వంశీ ఆ ప‌నిలో ఉన్నారు. ఈ సినిమా స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత ఉంటుంద‌ని తెలిసింది. దీంతో మ‌హేష్ తో సినిమా చేయాలంటే చాలా టైమ్ ప‌డుతుంద‌ని భావించి ఇలోపు వేరే సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌ ప‌ర‌శురామ్. గీత గోవిందం హీరో విజ‌య్ తోనే మ‌రో సినిమా చేసేందుకు ప‌ర‌శురామ్  ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించినా ప‌ర‌శురామ్  హీరో కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మ‌రి.. త‌దుప‌రి చిత్రాన్ని ఎవ‌రితో చేస్తాడో..? ఎప్పుడు చేస్తాడో..? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here