Home Actor ఆస్ట్రియాలో సాహో షూటింగ్ అద్భుతం – రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్

ఆస్ట్రియాలో సాహో షూటింగ్ అద్భుతం – రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్

36
0
ఆస్ట్రియాలో సాహో షూటింగ్ అద్భుతం - రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ spiceandhra

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాహో టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న రావ‌డంతో అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ప్ర‌స్తుతం సాహో ఆస్ట్రియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ…హాయ్ డార్లింగ్స్ …ఆస్ట్రియా దేశంలోని టిరోల్ రీజియన్ లో జరుగుతోంది. ఇక్క‌డ‌  షూటింగ్ ఎక్స్ పీరియ‌న్స్ అద్భుతం అంటూ ఓ ఫోటోను షేర్ చేసారు. ప్రభాస్ షేర్ చేసిన ఈ ఫొటోలో శ్రద్ధాకపూర్‌తో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులు కూడా ఉన్నారు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ భారీ ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ తదితర బాలీవుడ్ దిగ్గజాలు నటిస్తున్నారు. స్వాతంత్ర‌ దినోత్స‌వ  కానుకగా ఈ సినిమాను ఆగస్ట్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి  ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here