Home Actor ఆ..క‌ష్టానికి త‌గ్గే ఫ‌లిత‌మే రాక్ష‌సుడు విజ‌యం – బెల్లంకొండ సురేష్‌.

ఆ..క‌ష్టానికి త‌గ్గే ఫ‌లిత‌మే రాక్ష‌సుడు విజ‌యం – బెల్లంకొండ సురేష్‌.

18
0
ఆ..క‌ష్టానికి త‌గ్గే ఫ‌లిత‌మే రాక్ష‌సుడు విజ‌యం - బెల్లంకొండ సురేష్‌. spiceandhra

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం రాక్ష‌సుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ విద్యావేత్త కొనేరు సత్యనారాయణ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌ 2న విడుదల చేశారు. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ… మా అబ్బాయి 5 ఇయ‌ర్స్ నుంచి 7 పిక్చ‌ర్స్ చేసాడు. అల్లుడు శీను అనేది ఆరోజుల్లో చాలా మంది హీరోల‌కు తీసిపోని విధంగా 34 కోట్లు షేర్ క‌లెక్ట్ చేసింది. ఆ సినిమా త‌ర్వాత బోయ‌పాటి గారి ద‌ర్శ‌క‌త్వంలో జ‌య జాన‌కి నాయ‌క చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించాం కానీ… అవ‌న్నీ ద‌ర్శ‌కుల‌కు పేరు వ‌చ్చాయి కానీ..రాక్ష‌సుడు అనే సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి పేరు తీసుకువ‌చ్చింది.

అలాగే రెవెన్యూ సైడ్ కూడా సూప‌ర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 21 సంవ‌త్సరాలు అయ్యింది. 25 స్ట్రయిట్ సినిమాలు, 8 డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించాను. ఇవేవీ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు.

మా అబ్బాయి చేసిన ఆరు సినిమాలు ఓ ఎత్తైతే.. ఈ సినిమా మరో ఎత్తు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శనివారం 95 శాతం అక్యుపెన్సీ ఉండగా.. ఆదివారం నాటికి 100 శాతం అక్యుపెన్సీ ఉంది. ఈ చిత్ర నిర్మాత‌ కొనేరు సత్యనారాయణగారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈరోజుల్లో రీమేక్ చేయడం చాలా కష్టం. రమేశ్ వర్మ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి మార్పులు చేయకుండా అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. శ్రీనివాస్‌ను చాలా హ్యాండ్‌సమ్‌గా చూపించారు. మా అబ్బాయి గత చిత్రాలను మరచిపోయేలా ఈ సినిమా ఉంది.

యూట్యూబ్‌లో హిందీలో సౌత్‌లోనే నెంబర్ వన్ హీరోలాంటి సినిమాలు ఉన్నాయంటే బెల్లంకొండ శ్రీనివాస్‌దే. స్పీడున్నోడు 200 మిలియన్స్ దాటింది. జయజానకినాయక 140మిలియన్స్ దాటి రన్ అవుతోంది. కవచం సినిమా 125 మిలియన్స్ దాటింది. అల్లుడు శీను లేట్‌గా టెలికాస్ట్ అయినా 100 మిలియన్ దగ్గర వ్యూస్ చేరుకుంది. సౌత్‌లో 400 మిలియన్, రెండు టు హండ్రెడ్ మిలియన్ దాటిన సినిమాలు చేసిన ఏకైక‌ హీరో బెల్లంకొండ‌ శ్రీనివాసే. హిందీలో, శాటిలైట్ పరంగా మా సినిమాలు అత్యద్భుతమైన ఆదరణను పొందుతుంది.

రాక్షసుడు సినిమా విషయానికి వస్తే కొనేరు సత్యనారాయణగారు, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామాగారు సినిమాను భారీగా రిలీజ్ చేశారు. రమేశ్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో 100 స్క్రీన్స్‌ వేశారు. అప్పుడు సాంబయ్య సినిమాకు ఎలాగైతే నన్ను ప్రేక్షకులు ఆదరించారో.. ఇప్పుడు మా అబ్బాయిని అలా ఆదరిస్తున్నారు. సోమవారం రోజున కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా నుండి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేస్తామని, మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తామని చెబుతూ మెయిల్ పంపారు. అంత గొప్ప సంస్థ నుండి అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాం. తెలుగులో విజయవంతమైన ఓ చిత్రాన్ని బాలీవుడ్‌లో నేనే నిర్మాతగా మారి రీమేక్ చేయాలనుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావడంతోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదేళ్లుగా ఇలాంటి మంచి సక్సెస్ కోసం వెయిట్ చేశాను. మా అబ్బాయి 5 వ త‌ర‌గ‌తి నుంచి హీరో అవ్వాల‌ని చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లిత‌మే ఈ స‌క్స‌స్. ఈ సినిమాని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here