Home Movie News ఆ టైమ్ లో..త‌మ్ముడు హ‌రికృష్ణ న‌న్నెంతో ప్రేమ‌గా చూసుకున్నారు – మోహ‌న్ బాబు

ఆ టైమ్ లో..త‌మ్ముడు హ‌రికృష్ణ న‌న్నెంతో ప్రేమ‌గా చూసుకున్నారు – మోహ‌న్ బాబు

91
0
Hari krishna - Mohanbau

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణించార‌నే వార్తను కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆయ‌న స‌న్నిహితులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. నంద‌మూరి ఫ్యామిలీతో స‌న్నిహితంగా ఉండే ప్ర‌ముఖుల్లో మోహ‌న్ బాబు ఒక‌రు. ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు అమెరికాలో ఉన్నారు. ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ..త‌మ్ముడు హ‌రికృష్ణ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నేను ఇండియాలో లేను, అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణ వార్త నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్ లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. ఆ రోజున మొదలైన మా అనుబంధం ఈ నాటికీ కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – మోహన్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here