Home Movie News ఆ వాయిస్ నాది కాదు – హీరో సుధీర్ బాబు..!

ఆ వాయిస్ నాది కాదు – హీరో సుధీర్ బాబు..!

93
0

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వైవిధ్య‌మైన చిత్రం వీర భోగ వసంత రాయలు. నూతన ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన ఆర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ న‌టించ‌డం విశేషం. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ సుకుమార్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. బాబా క్రియేష‌న్స్ ప‌తాకం పై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ ట్రైల‌ర్ లో సుధీర్ బాబు వాయిస్ డిఫ‌రెంట్ గా ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది. సుధీర్ బాబు వాయిస్ ఏంటి..? ఇలా ఉంది అని..!  ట్విట్ట‌ర్ లో చాలా మంది సుధీర్ బాబుని ట్యాగ్ చేసి వాయిస్ ఏంటి ఇలా ఉంది..?  ఈ వాయిస్ మీదేనా..?  అని అడిగారు. ఈ విషయంపై స్పంధించిన సుధీర్‌ బాబు ఆ వాయిస్‌ నాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల వీర భోగ వసంత రాయలు సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పలేదు. ఆ కారణాలను ట్వీట్‌లో వివరించడం సాధ్యం కాదు అంటూ ట్వీట్ చేశారు. అదీ..సంగ‌తి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here