Home Actor ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు – మోహ‌న్ బాబు.

ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు – మోహ‌న్ బాబు.

56
0
ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు - మోహ‌న్ బాబు. spiceandhra

సీనియర్ న‌టుడు, నిర్మాత‌, శ్రీ విద్యానికేత‌న్ సంస్థల అధినేత డా.మంచు మోహ‌న్‌బాబు ఎన్నికల ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే… కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డ దగ్గర నుంచి మోహన్‌బాబుకు కీలక పదవులు ఇస్తున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మోహన్‌బాబును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను మోహన్‌ బాబు ఖండించారు.

తాజాగా… ఆంధ్రప్రదేశ్  ఫిలిమ్‌ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌.డి.సి) చైర్మ‌న్‌గా సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, శ్రీ విద్యానికేత‌న్ సంస్థ‌ల అధినేత డా.మంచు మోహ‌న్‌బాబుని నియ‌మించార‌ని సోష‌ల్ మీడియాలో కొన్నిచోట్ల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు. రూమ‌ర్స్‌ను న‌మ్మ‌కండి. ఒక‌వేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం అని మోహ‌న్‌బాబు పి.ఆర్ టీమ్ తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here