Home Actor ఆ..విష‌యంలో ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం – పూరి

ఆ..విష‌యంలో ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం – పూరి

55
0
ఆ..విష‌యంలో ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం - పూరి spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజైన ఫ‌స్ట్ డే ఫ‌ష్ట్ షో నుంచి బ్లాక్ బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో స‌క్స‌స్ టూర్ నిర్వ‌హిస్తుంది. 

ఈ టూర్ లో పూరి జ‌గ‌న్నాథ్ మీడియాతో మాట్లాడుతూ… ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. స‌క్సస్ కంటే ఎక్కువ మ్యాడ్ నెస్ క్రేజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 3 ఇయ‌ర్స్ త‌ర్వాత నాకు ఇంత పెద్ద హిట్ రావ‌డం సో..హ్యాపీ. థియేట‌ర్ కి వెళ్లి చూసాను. ప్రేక్ష‌కులు సాంగ్స్ కానీ..డైలాగ్స్ కానీ.. ఎంజాయ్ చేయ‌డం చూస్తుంటే… మాకు ఎన‌ర్జీని ఇస్తుంది. మాస్ సినిమా పొట‌న్షియ‌ల్ ఏంటో ఈ సినిమా చెప్పింది నాకు. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాన‌ని అనుకుంటున్నాను.

సిద్దిపేట‌, అనంపురం, క‌ర్నూలు వెళ్లాం. విజ‌య‌వాడ వ‌చ్చాం. ఏలూరు, భీమ‌వ‌రం.. ఇలా వైజాగ్ వ‌ర‌కు ఈ విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగిస్తాం. మా హీరో ఇస్మార్ట్ శంక‌ర్ యు.ఎస్ ట్రిప్ లో ఉండ‌డం వ‌ల‌న ఈ టూర్ లో లేడు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతాది. విజ‌య‌వాడ మ‌ళ్లీ వ‌స్తాం మరోసారి ప్రేక్ష‌కుల్ని క‌లుస్తాం. సినిమా బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు అన‌డానికి ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here