Home Actor ఆ..విష‌యంలో క్లారిటీ ఇచ్చిన మ‌న్మ‌థుడు.

ఆ..విష‌యంలో క్లారిటీ ఇచ్చిన మ‌న్మ‌థుడు.

59
0
ఆ..విష‌యంలో క్లారిటీ ఇచ్చిన మ‌న్మ‌థుడు. spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తోన్న తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. ఈ చిత్రంలో నాగ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్ చేయ‌డం విశేషం. ఈ మూవీ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే… ఈ సినిమాని ఆగ‌ష్టు 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. అయితే.. ఈ సినిమా వ‌చ్చిన వారానికి బాహుబ‌లి ప్ర‌భాస్ సాహో సినిమా వ‌స్తుంది. అందుచేత‌ నాగ్ టీమ్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని.. ఈ కార‌ణం చేత‌నే ఇంకా ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌లేదు. మ‌న్మ‌థుడు 2 వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌తో మ‌న్మ‌థుడు 2 వాయిదా ప‌డుతుందా..?  నిజ‌మేనా..? అని  అభిమానుల్లో అనుమానాలు ఏర్ప‌డ్డాయి.

ఇప్పుడు ఆ.. అనుమానాల‌కు తెర దించుతూ నాగ్ ట్విట్ట‌ర్ ద్వారా మ‌న్మ‌థుడు 2 ఆగ‌ష్టు 9 ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అంటూ క‌న్ ఫ‌ర్మ్ చేసారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి.. సినిమా పై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఎంత వ‌ర‌కు అందుకుంటుందో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here