Home Actor ఆ విష‌యంలో.. మ‌హి యాత్ర‌ ప్లానింగ్ అదిరిందిగా..!

ఆ విష‌యంలో.. మ‌హి యాత్ర‌ ప్లానింగ్ అదిరిందిగా..!

92
0

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర‌ను ఆధారంగా రూపొందిన సంచ‌ల‌న చిత్రం యాత్ర‌. ఆనందో బ్ర‌హ్మ ఫేమ్ మ‌హి వి రాఘ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి వై.ఎస్ పాత్ర‌ను పోషించిన ఈ సినిమాని ఈ నెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమ‌ని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేయ‌లేదు. ఎందుకంటే… పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ‌..కేవ‌లం ఈ రెండు సినిమాల‌ను మాత్ర‌మే తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ వై.ఎస్ పై సినిమా తీయ‌డ‌మా..? అని ఎవ‌రు కూడా  సీరియ‌స్ గా తీసుకోలేదు.

అయితే…ఇందులో మ‌ల‌యాళ అగ్ర హీరో, లెజండ‌రీ యాక్ట‌ర్ మ‌మ్ముట్టి వై.ఎస్ పాత్ర‌ను పోషిస్తున్నారు అనగానే ఇదేదో సీరియ‌స్ గానే తీస్తున్న‌ట్టున్నారు అని అటు అభిమానుల్లో, ఇటు ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి ఏర్ప‌డింది. వై.ఎస్ పాత్ర‌ను తెలుగులో ఏ స్టార్ హీరో చేసినా…ఆ పాత్ర‌లో వై.ఎస్ ను కాకుండా ఆ స్టార్ హీరోను చూస్తారు. అది గుర్తించిన మ‌హి వి రాఘ‌వ మ‌మ్ముట్టిని ఎంచుకోవ‌డంలోనే స‌క్స‌స్ సాధించ‌డ‌ని చెప్ప‌చ్చు. ఇక సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత పోస్ట‌ర్, టీజ‌ర్, ట్రైల‌ర్…ఇలా ప్ర‌తిదీ ప‌క్కా ప్లాన్ తో రిలీజ్ చేస్తూ ఆడియ‌న్స్ లో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసారు.

ఈ నెల 8న యాత్ర రిలీజ్ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్‌ తన టీంతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఏమ‌న్నారంటే.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావటం వరంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరించిన వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులకు, కోట్లాది కూడా ఉన్న ఆయన అభిమానులకు కృతజ్ఞతలు. ఈ సినిమాను మరే సినిమాలో పోల్చటం గానీ, పోటిగా చూపించటం కానీ చేయకండి. ఆ మహానాయకుడి యాత్రను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం.

ఎన్టీఆర్ గారూ, వైఎస్‌ఆర్‌గారూ ఈ మట్టి వారసులు, ఎంతో కీర్తిని, గౌరవాన్ని మనకు వదిలి వెళ్లిన తెలుగు లెజెండ్స్‌‌. మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. వైఎస్‌ఆర్‌, చిరంజీవి గారి పట్ల నా ప్రేమ కారణంగా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు. మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో తెలుసుకునేందుకు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నాను అని తెలియ‌చేసారు. ఈవిధంగా స్పందించి మ‌హి అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు. వై.ఎస్ యాత్ర‌ను వీలైనంత ఎక్కువ మంది ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్లేలా చేసిన‌ మ‌హి ప్లానింగ్ అదిరింది. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే యాత్ర‌ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌నీ…మ‌హి క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం అందిస్తుంద‌ని ఆశిస్తూ..ఆల్ ది బెస్ట్ టు యాత్ర టీమ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here