Home Political News ఆ విష‌యం పై బాల‌కృష్ణ స‌మాధానం చెప్పాలి – త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

ఆ విష‌యం పై బాల‌కృష్ణ స‌మాధానం చెప్పాలి – త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

108
0
Talasani-Escapes-A-Major-Accident-By-a-Whisker

తెలంగాణ‌లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ‌డం తెలిసిందే. అయితే…తెలంగాణ‌లో తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవ‌డం పై కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు తెలుగుదేశం నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ తెలంగాణ‌లోని ఖ‌మ్మంలో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌ధిర‌, స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను బాల‌కృష్ణ ఆవిష్క‌రించారు. దాదాపు 45 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి, టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈ నేప‌ధ్యంలో టిఆర్ఎస్ నాయ‌కుడు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బాల‌కృష్ణ ప్ర‌చారం పై స్పందిస్తూ…కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో టీడీపీ తుడిచి పెట్టుకుపోతుందని… ఇక ఈ పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల  ఏపీలో టీడీపీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తారని అన్నారు. తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తోన్న బాల‌కృష్ణ కాంగ్రెస్, టీడీపీ బంధం పై స‌మాధానం చెప్పాలి. ఇది మ‌హా కూట‌మి కాదు. ముఠా కూట‌మి అని ఆరోపించారు. ఏం చేయ‌లేద‌ని తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను ఓడిస్తార‌న్నారని ప్ర‌శ్నించారు.  రేవంత్ లాంటి వ్య‌క్తులు కావాల‌నే ప్ర‌జ‌ల‌ను, టీఆర్ఎస్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పై ప్ర‌జ‌ల‌కు పూర్తి విశాస్వం ఉంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here