Home Actor ఇంట్ర‌స్టింగ్ గా.. ర‌ణ‌రంగం టీజ‌ర్.

ఇంట్ర‌స్టింగ్ గా.. ర‌ణ‌రంగం టీజ‌ర్.

95
0
ఇంట్ర‌స్టింగ్ గా.. ర‌ణ‌రంగం టీజ‌ర్. spiceandhra

యువ హీరో శ‌ర్వానంద్, కాజ‌ల్ అగ‌ర్వాల్, ప్రియ‌ద‌ర్శిని హీరో,హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ర‌ణ‌రంగం. ఈ చిత్రానికి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాల’ని శర్వానంద్ చెప్పిన డైలాగ్ తో టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది. 

‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’…ఇలా  శర్వానంద్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.  90ల నాటి కాలం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది. కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌‌ను బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగష్టు 2న ర‌ణ‌రంగం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here