Home Movie News ఇంట్ర‌స్టింగ్ బాక్సాఫీస్ వార్ లో విన్న‌ర్ ఎవ‌రు..?

ఇంట్ర‌స్టింగ్ బాక్సాఫీస్ వార్ లో విన్న‌ర్ ఎవ‌రు..?

91
0
samantha-chaithu

ఇంట్ర‌స్టింగ్ బాక్సాఫీస్ వార్ జ‌ర‌గ‌బోతుంది. ఈ వార్ లో విన్న‌ర్ గా ఎవ‌రు నిలుస్తారు అనేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే…అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ మూవీని సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే…స‌మంత న‌టించిన తాజా చిత్రం యు ట‌ర్న్. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందిన ఈ సినిమా కూడా సెప్టెంబ‌ర్ 13నే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇలా..భార్య‌భ‌ర్త‌ల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం అనేది టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డం విశేషం. ఈ రెండు సినిమాల పై పాజిటివ్ టాక్ ఉంది. ఖ‌చ్చితంగా స‌క్స‌స్ సాధిస్తాయ‌ని రెండు చిత్రాల టీమ్ మెంబ‌ర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మ‌రి…ఈ ఇంట్ర‌స్టింగ్ బాక్సాఫీస్ వార్ లో ఇద్ద‌రూ.. విన్న‌ర్స్ గా నిలుస్తారో..?  లేక ఒక‌రే విన్న‌ర్ గా నిలుస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here