Home Actor ఇండియ‌న్ 2 గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్.

ఇండియ‌న్ 2 గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్.

42
0
ఇండియ‌న్ 2 గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్. spiceandhra

యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ – గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భార‌తీయుడు. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ గా ఇండియ‌న్ 2 ప్రారంభించారు. అయితే… కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా ఆగ‌లేద‌ని ప్ర‌క‌టించ‌డం.. షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభించ‌డం.. మ‌ళ్లీ ఆగిపోవ‌డం జ‌రిగింది.

ఇప్పుడు ఈ సంచ‌ల‌న చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…ఆగ‌స్ట్ 19న షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని రాజమండ్రిలో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట‌. ఈ చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ఐశ్వ‌ర్యారాజేశ్‌, ప్రియాభ‌వాని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ  సీక్వెల్‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ  నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here