Home News ఇద్దరు వైసీపీ మాజీ శాసనసభ్యులు టీడీపీలో చేరిక.

ఇద్దరు వైసీపీ మాజీ శాసనసభ్యులు టీడీపీలో చేరిక.

68
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రాజ‌కీయ వ‌ల‌స‌లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఇద్ద‌రు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో భీమిలి మాజీ శాసనసభ్యుడు కర్రి సీతారాం, మాడుగుల మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు  తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్రి సీతారాం , పూడి మంగపతిరావులను గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువ‌చ్చారు.

ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునుకర్రి శీతారం, పూడి మంగపతిరావు క‌లిసారు. కర్రి శీతారం, పూడి మంగపతిరావులకు పసుపు కండువా కప్పి చంద్ర‌బాబు తెదేపాలోకి ఆహ్వానించారు. పలువురు అనుచరులతో  కర్రి సీతారాం, పూడి మంగపతిరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీతారాం, మంగపతిరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here