Home Political News ఇవాళ కారు జోరు ఉండొచ్చు రేపు రిపేర్ కావ‌చ్చు – కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్

ఇవాళ కారు జోరు ఉండొచ్చు రేపు రిపేర్ కావ‌చ్చు – కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్

108
0

తెలంగాణ ఎన్నికల ఫ‌లితాల గురించి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ స్పందించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ఓటమితో క్యాడర్అధైర్యపడొద్దని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఇవాళ కారు జోరుఉండొచ్చని…రేపు రిపేర్ కావొచ్చని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీతోకపార్టీ అని విమర్శించారు. 105 మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదని…ఇక బీజేపీ కార్యాలయానికి తాళం వేసుకోవాలన్నారు. బీజేపీకి ఓ స్టాండ్‌ అంటూ లేదని పొన్నం ప్రభాకర్ విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here