Home Actor ఇస్మార్ట్ శంకర్ లేటేస్ట్ అప్ డేట్..?

ఇస్మార్ట్ శంకర్ లేటేస్ట్ అప్ డేట్..?

61
0

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమా ఇటీవ‌ల‌ గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  ప్ర‌ధాన తారాగ‌ణం పై కీల‌క స‌న్నివేశాల‌ను, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరో రామ్‌ను స‌రికొత్త కోణంలో చూపించ‌బోతున్నారు.

ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే…వార‌ణాసిలో యాక్ష‌న్ సీన్స్ ని చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేసారు. ఈరోజు ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ వార‌ణాసి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌ల్లో ఒకరైన ఛార్మి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ…ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఉన్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్ షెడ్యూల్ ఉంటుంది. దీంతో షూటింగ్ పూర్త‌వుతుంది. 

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న‌ ఈ సినిమాను జూన్ నెలాఖ‌రున కానీ..జులై ఫ‌స్ట్ వీక్ లో కానీ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారని స‌మాచారం. మ‌రి..స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న పూరి, రామ్ ల‌కు ఇస్మార్ట్ శంక‌ర్ ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here