Home Actor “ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్.

“ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్.

68
0

 ‘ఇస్మార్ట్ శంకర్’ అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయ శంఖారావం మ్రోగిస్తోంది. ఈ విజయంలో పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ మాస్ అప్పీల్ తోపాటు కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్యమైన విషయాలు రామ్ & నభా నటేష్ క్యారెక్టర్స్ మరియు వారి నడుమ సాగే ఆసక్తికరమైన కెమిస్ట్రీ.. రామ్ మేనరిజమ్స్, తెలంగాణ స్లాంగ్, హెవీ డ్యాన్స్ మూవ్స్ & యాక్షన్ బ్లాక్స్ లో అతడు చూపిన ఈజ్ కి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుండగా..వైవిధ్యమైన పాత్రలో నభా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది.

మొదటి సినిమా ‘నన్ను దోచుకొందువటే’లో క్యూట్ గా ఆకట్టుకున్న నభా ‘ఇస్మార్ట్ శంకర్స‌లో అల్ట్రా మాస్ యాటిట్యూడ్ & పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసి మాస్ ఆడియన్స్ కు మరింత చేరువైంది. ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలో రామ్-నభా ల నడుమ సాగే టిపికల్ రొమాన్స్ & కెమిస్ట్రీ మరెక్కడా కనిపించలేదు. పూరీ జగన్నాధ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాసుకున్న ఈ కెమిస్ట్రీ జనాల్ని విశేషంగా ఎంటర్ టైన్ చేస్తోంది. నిజానికి షూటింగ్ టైంలొనే వారి నడుమ వచ్చే సన్నివేశాలు చూసి క్రూ మెంబర్స్ భలే ఉన్నాయి అనుకొనేవారట. రామ్-నభా ల నడుమ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుండడం చూసి పూరీ ముందు అనుకున్నదానికంటే కొన్ని సన్నివేశాలు ఎక్కువగా రాసాడట.

రామ్-నభాల రొమాన్స్ మాత్రమే కాదు వారి కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటోంది. థియేటర్లో జనాలు వారి కాంబినేషన్ సీన్స్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, శంకర్-చాందిని పాత్రలు ప్రేక్షకులకు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ పాత్రలు పోషించిన రామ్-నభాలను ప్రేక్షకులు మర్చిపోతారా చెప్పండి. మొత్తానికి నభా సెకండ్ సినిమా సిండ్రోమ్ ను తప్పించుకొని.. రెండో సినిమాతోనే కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను దక్కించుకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here