Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం – రామ్.

ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం – రామ్.

38
0
ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం - రామ్. spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో చిన్న పిల్ల‌లు చూసేందుకు అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌న్నివేశాలు ఉండ‌డం వ‌ల‌న సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

అయితే.. ఈ సినిమా గురించి రామ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు ఇస్మార్ట్ శంకర్‌ లా నిజ జీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్ట్ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అని తెలుసుకుని ఇస్మార్ట్ గా వ్యవహరించండి అని తెలిపాడు. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here