Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ ఇప్ప‌ట్లో ఆగేలాలేడు.

ఇస్మార్ట్ శంక‌ర్ ఇప్ప‌ట్లో ఆగేలాలేడు.

83
0
ఇస్మార్ట్ శంక‌ర్ ఇప్ప‌ట్లో ఆగేలాలేడు spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అయితే… విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ మూవీ వ‌చ్చిన త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ క‌లెక్ష‌న్స్ త‌గ్గుతాయి అనుకున్నారు.

కానీ.. అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ ఇస్మార్ట్ శంక‌ర్ హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతున్నాడు. ఒక్క హైద‌రాబాద్ లోనే  కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఇదే ప‌రిస్ధితి. ఇంకా చెప్పాలంటే.. కొన్ని చోట్ల డియ‌ర్ కామ్రేడ్ క‌న్నా ఇస్మార్ట్ శంక‌ర్ కే ఎక్కువ క‌లెక్ష‌న్స్ ఉన్నాయి. ఏ సెంట‌ర్స్ లో డియ‌ర్ కామ్రేడ్ కి క‌లెక్ష‌న్స్ ఉన్నా… బి, సి సెంట‌ర్స్ లో మాత్రం  ఇస్మార్ట్ శంక‌ర్ దే హ‌వా.

ఈ ఇస్మార్ట్ శంక‌ర్ హ‌వా చూస్తుంటే… ఇప్ప‌ట్లో ఆగేలాలేడు. ఇటీవ‌ల ఆంధ్రాలో స‌క్స‌స్ టూర్ నిర్వ‌హించిన ఇస్మార్ట్ టీమ్ ఇప్పుడు తెలంగాణ‌లో స‌క్స‌స్ టూర్ నిర్వ‌హిస్తుంది. ఈ రోజు నుంచి తెలంగాణ‌లో స‌క్స‌స్ టూర్ ప్రారంభించారు. ఇదే జోరు కంటిన్యూ అయితే… ఫుల్ ర‌న్ లో ఈ శంక‌ర్ 100 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here