Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ ఇర‌గ‌దీసాడుగా..!

ఇస్మార్ట్ శంక‌ర్ ఇర‌గ‌దీసాడుగా..!

25
0

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే.. రిలీజ్ కి ముందు ఈ సినిమా  ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది అనే టాక్ వ‌చ్చింది కానీ.. ఈరోజు ఓపెనింగ్స్ చూస్తుంటే మ‌తిపోతుంది అనే రేంజ్ లో ఉన్నాయి. హైద‌రాబాద్ లో రిలీజ్ చేసిన అన్ని థియేట‌ర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.

ఒక్క హైద‌రాబాద్ లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా ఇదే ప‌రిస్థితి. ఇస్మార్ట్ శంక‌ర్.. ఇస్మార్ట్ శంక‌ర్. ట్రేడ్ పండితులు సైతం ఈ ఓపెనింగ్స్ చూసి షాక్ అవుతున్నారు. పూరి ట్రాక్ రికార్డ్, రామ్ ట్రాక్ రికార్డు ఇంకా చెప్పాలంటే… ఈ సినిమాలో న‌టించిన హీరోయిన్స్, అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌…ఇలా ఎవ‌రి ట్రాక్ రికార్డు చూసుకున్నా స‌రిగా లేదు క‌దా.. మ‌రి అలాంటిది ఈ సినిమాకి ఇంత‌గా ఓపెనింగ్స్ రావ‌డం ఏంటా అని .

ఫ‌స్ట్ ట్రైల‌ర్ కి మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా..సెకండ్ ట్రైల‌ర్ కు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అది సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యింది. దీనికి తోడు ఈ ఇయ‌ర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రేంజ్ మాస్ సినిమా రాలేదు. పూరి కూడా ఈసారి ఎలాగైనా స‌రే.. హిట్టు కొట్టాల‌ని మ‌న‌సు పెట్టి మ‌రీ ఈ సినిమా చేసాడు. ఫ‌స్ట డేలోనే దాదాపుగా 50% రిక‌వ‌రీ అవుతుంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఫ‌స్ట్ డే టిక్కెట్లు దొర‌క‌క చాలా మంది వీకెండ్ బుక్ చేసుకున్నారు. ఈ సినిమాకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌తో థియేట‌ర్ల‌ను పెంచాల‌నుకుంటున్నార‌ట‌. రామ్ కెరీర్ లో బెస్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుందీ సినిమా. మొత్తానికి ఈసారి పూరి (జ‌) గ‌న్ గురి త‌ప్ప‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here