Home Actor ఇస్మార్ట్ శంక‌ర్.. కౌంట‌ర్ అదిరిందిగా..!

ఇస్మార్ట్ శంక‌ర్.. కౌంట‌ర్ అదిరిందిగా..!

42
0
ఇస్మార్ట్ శంక‌ర్.. కౌంట‌ర్ అదిరిందిగా..! spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన బ్లాక్ బ‌ష్ట‌ర్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్.  ఈ సినిమా అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసి.. సినీ పండితులు, ట్రేడ్ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వీకెండ్ లో మాత్ర‌మే కాకుండా… వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ సాధిస్తూ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధిస్తుంది.  ఇదిలా ఉంటే.. ఇస్మార్ట్ శంక‌ర్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ విమ‌ర్శ‌ల పై రామ్ స్పందిస్తూ… హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.,హీరో స్మోక్ చేస్తున్నాడు.,హీరో అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వలేదు.,ఎంత సేపూ.. ఇవే గాని, అక్కడ హీరో అడ్డమొచ్చిన వాడినల్లా చంపేస్తున్నాడని ఒక్కడు కూడా కంప్లైంట్ చేయడం లేదు. ప్రాణాలకు విలువ లేదు. బాధాకరం అని త‌న‌దైన శైలిలో ట్విట్ట‌ర్ ద్వారా కౌంట‌ర్ ఇచ్చాడు. మ‌రో ట్వీట్ లో.. గిది సినిమా రా బై.. సీన్ చూడండి.. సీన్ చేయ‌కండి అన్నాడు.

ఎవ‌రు ఎలా విమ‌ర్శ‌లు చేసినా… జ‌నం మాత్రం ఇస్మార్ట్ శంక‌ర్ ని చూడ‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. బి, సి సెంట‌ర్స్ లో అయితే.. ఇస్మార్ట్ శంక‌ర్ ధియేట‌ర్ ద‌గ్గ‌ర‌ హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఫ‌స్ట్ 3 డేస్ లోనే డిస్ట్రిబ్యూట‌ర్స్ కి  ఫ్రాఫిట్స్ ఇచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ ఇక ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేస్తాడో చూడాలి.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here