Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతుందా తెలుసా..?

ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతుందా తెలుసా..?

57
0
ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతుందా తెలుసా..? spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యాన‌ర్స్ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ లుక్ కొత్త‌గా ఉండ‌డంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం అందిస్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన టీజ‌ర్ లో రామ్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చూపించారు కానీ..క‌థ ఏంటి అనేది చెప్ప‌లేదు. ఇప్పుడు రిలీజ్ చేయ‌నున్న  ట్రైల‌ర్ లో అస‌లు సినిమా క‌థ ఏంటి..?  ఎలా ఉండ‌బోతుంది అనేది క్లియ‌ర్ గా చెప్ప‌నున్నార‌ట‌. మ‌రి..ఈ సినిమాతో పూరి – రామ్ క‌లిసి ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటారో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here