Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ సెన్సేష‌న్. ఈసారైనా పూరికి హిట్ వ‌చ్చేనా..?

ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ సెన్సేష‌న్. ఈసారైనా పూరికి హిట్ వ‌చ్చేనా..?

43
0
ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ సెన్సేష‌న్. ఈసారైనా పూరికి హిట్ వ‌చ్చేనా..? spiceandhra

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రంలో ఎన‌ర్జిటిక్ హీరో రామ్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, నభా నటేశ్ న‌టించారు. ఈ మూవీ ట్రైల‌ర్ ను పూరి ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. రామ్ అంటే ఎన‌ర్జి..పూరి అంటే మాస్..వీరిద్ద‌రు క‌లిస్తే..ఇక డ‌బుల్ మాస్ అనేలా ఈ ట్రైల‌ర్ ఉంది.

 ఏ బొమ్మా  .. నువ్వు ‘ఊ’ అంటే గోల్కొండ రిపేరు జేసి నీ చేతిలో పెడతా. నిన్ను బేగంను చేసి ఖిల్లా మీద కూర్చో పెడతా.. క్యా బోల్తే..ఆ అంటూ రామ్ అంటే.. ‘ఒరేయ్, వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించినా..’ అంటూ నభా నటేశ్ డైలాగ్స్ చెప్పడంతో వీరిద్ద‌రు క్యారెక్ట‌ర్స్ ఎలా ఉంటాయో ఈ డైలాగ్స్ తో  చూపించారు.

వీటితో పాటు పూరి స్టైల్ డైలాగులు మాస్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈమ‌ధ్య కాలంలో ఈ రేంజ్ ఊర మాస్ సినిమా వ‌చ్చి చాలా రోజులు అయ్యింది. దీంతో ఈ ట్రైల‌ర్ సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింద‌ని చెప్ప‌చ్చు. ఇలా ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారో లేదో..అలా యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4 మిలియ‌న్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1 గా నిలిచింది.

పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్ గా జ‌రుపుకుంటోంది. ఈ నెల 18న ఇస్మార్ట్ శంక‌ర్ థియేట‌ర్ లోకి రానున్నాడు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే…పూరికి మాంచి హిట్ ఇచ్చేలా క‌నిపిస్తుంది. మ‌రి..ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here