Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడు..?

ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడు..?

72
0


డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఇందులో రామ్, నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్ పై పూరి – ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా గోవాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రామ్ పై కొన్ని యాక్ష‌న్ సీన్స్ ని చిత్రీక‌రించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఓ వైపు షూటింగ్ చేస్తుండ‌గానే..మ‌రో వైపు ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే…మే లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే..లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…మే నెలాఖ‌రున లేదా జూన్ ఫ‌స్ట్ వీక్ లో ఇస్మార్ట్ శంక‌ర్ ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు పూరి జ‌గ‌న్నాథ్ తెలియ‌చేసారు. రామ్, పూరి..ఇద్ద‌రికీ ఖ‌చ్చితంగా హిట్ కావాలి. మ‌రి..ఇస్మార్ట్ శంక‌ర్ ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here