Home Actor ఇస్మార్ట్ శంక‌ర్.. ప్రేమ గీతం.. వ‌చ్చేసింది..నచ్చేసింది..!

ఇస్మార్ట్ శంక‌ర్.. ప్రేమ గీతం.. వ‌చ్చేసింది..నచ్చేసింది..!

247
0
ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేమ గీతం.. వ‌చ్చేసింది..నచ్చేసింది..! spiceandhra

యంగ్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్  ‘ఇస్మార్ట్ శంకర్’ . నిధి అగర్వాల్ – నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ప్ర‌స్తుతం పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన టీజర్ & సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఈ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

ఈ రోజు ఈ సినిమా నుంచి ఓ పాట‌ను రిలీజ్ చేసారు. “ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా…” అంటూ ఈ పాట సాగుతోంది. స్వ‌ర‌బ్ర‌హ్మ మణిశర్మ అందించిన ఈ బాణీ చాలా బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఆయన ఈ పాటను స్వరపరిచారు.

అడ‌గాలే కానీ..నువ్వు అల‌వోక‌గా..నా ప్రాణ‌మైన ఇస్తా..అడ‌గొచ్చుగా..ప్రాణం నీద‌ని నాద‌ని రెండూ వేరుగా లేవుగా..ఎప్పుడో క‌లుపుకున్నాం క‌దా..విడిగా ఉండ‌లేనంత‌గా…ఉందాం అడుగులో అడుగులా..విందాం ప్రేమ‌లో గ‌ల‌గ‌లా..బంధం బిగిసిపోయిందిగా..అంతం కాదులే మ‌న క‌థా..ఇలా ప్రేమికులు పాడుకునే ఈ పాట‌ను చాలా క్యాచీగా ఉండే ప‌దాల‌తో భాస్కర భట్ల అందించడంతో  విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంది.  అనురాగ్ కులకర్ణి – రమ్య బెహరా ఈ పాటకి ప్రాణం పోశారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here